భారతదేశ విద్యా చరిత్ర – పూర్తి స్టడీ గైడ్
యూనిట్ 1: భారతదేశం – విద్యా చరిత్ర (పూర్తి సమాచారం)
అతి ప్రాచీన కాలం నుండి భారతదేశం విద్యా కేంద్రంగా ఉండేది. ప్రపంచంలోని అన్ని దేశాలకంటే భారతదేశంలోనే ముందుగా విద్యావ్యవస్థ ప్రారంభమైనదని, విద్య అత్యంత పటిష్ఠంగాను, శాశ్వతంగాను ప్రభావితమైన దేశం మరొకటి లేదని ఎఫ్.డబ్ల్యు. థామస్ భావన. అనేక దేశాల నుండి భారతదేశాన్ని సందర్శించిన యాత్రికులు భారతీయ విద్య గురించిన వివరాలు తెలియజేశారు.
తక్షశిల విశ్వవిద్యాలయం
ప్రపంచంలోని మొట్టమొదటి విశ్వవిద్యాలయం. పాకిస్థాన్లో సింధూ నది ఒడ్డున ఉంది. పాణిని, జీవకుడు, కౌటిల్యుడు ఇక్కడ ఆచార్యులుగా పనిచేశారు.
నలంద విశ్వవిద్యాలయం
బీహార్లో క్రీ.శ. 5 నుండి 12వ శతాబ్దం వరకు 700 సంవత్సరాల పాటు విలసిల్లింది. భక్తియార్ ఖిల్జీ దీనిని ధ్వంసం చేశాడు.
విద్య – నిర్వచనాలు & భావన
- 🔹 ఋగ్వేదం: వ్యక్తిని తన శక్తిపై తనకు నమ్మకమున్నవానిగాను, నిస్వార్థపరునిగాను తయారుచేసేదే విద్య.
- 🔹 ఉపనిషత్తులు: విద్య యొక్క అంతిమ లక్ష్యం మోక్ష సాధన.
- 🔹 గాంధీజీ: మానవులలో గల అత్యున్నత శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తులను సమగ్రముగా వెలికితీసేది విద్య.
- 🔹 స్వామి వివేకానంద: శీల నిర్మాణానికి, నైతిక జీవనానికి విద్య మార్గం (Man-making education).
- 🔹 డా॥ రాధాకృష్ణన్: విద్య ఆధ్యాత్మిక జీవనానికి మార్గం కావాలి. విద్య రెండవ జన్మ కావాలి.
విద్య రకాలు (Types of Education)
1. నియత విద్య (Formal)
పాఠశాలలు/కళాశాలల ద్వారా క్రమబద్ధంగా, ఉద్దేశపూర్వకంగా పొందే విద్య.
2. అనియత విద్య (Non-formal)
వయస్సుతో సంబంధం లేకుండా దూరవిద్య, ఓపెన్ యూనివర్సిటీల ద్వారా పొందే విద్య.
3. యాదృచ్ఛిక విద్య (Informal)
కుటుంబం మరియు సంఘం ద్వారా అనుభవాల ద్వారా నేర్చుకునే విద్య.
బ్రిటీష్ కాలం & స్వాతంత్ర్యానంతర కమిషన్లు
మెకాలే మినిట్స్ (1835): ఆంగ్ల విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారు. ఆంగ్ల విద్య ద్వారా రంగులో భారతీయులై ఉండి అభిరుచులలో ఆంగ్లేయులుగా ఉండే వర్గాన్ని తయారు చేయాలని తలచారు.
ఉడ్స్ తాఖీదు (1854): భారతదేశ విద్యకు మాగ్నాకార్టా. కలకత్తా, బొంబాయి, మద్రాసులలో విశ్వవిద్యాలయాల స్థాపనకు సూచన.
కొఠారి కమిషన్ (1964-66): “విద్య – జాతీయ అభివృద్ధి” శీర్షికతో నివేదిక. దేశవ్యాప్తంగా 10+2+3 విద్యా విధానాన్ని ప్రతిపాదించింది.
ఆన్లైన్ ప్రాక్టీస్ క్విజ్ (64 ప్రశ్నలు)
ప్రతి ప్రశ్నకు సరైన సమాధానాన్ని ఎంచుకోండి. క్విజ్ పూర్తయ్యాక మీ స్కోర్ మరియు లీడర్‌బోర్డ్ ప్రదర్శించబడుతుంది.